: సీమాంధ్రలో కాంగ్రెస్, టీడీపీ.. నువ్వానేనా..


పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, టీడీపీ నువ్వా? నేనా? అన్నట్టు సాగుతున్నాయి. తొలి విడత ఎన్నికల పోలింగ్ ఈ మధ్యాహ్నంతో ముగియగా.. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి సీమాంధ్ర జిల్లాల్లో అధికార కాంగ్రెస్ కు ప్రధాన విపక్షం టీడీపీ గట్టిపోటీనిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ 43 పంచాయతీలను గెలుచుకోగా, టీడీపీ 56 పంచాయతీలతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక వైకాపా కూడా 25 సర్పంచులను గెలిపించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి 28 పంచాయతీలు దక్కగా, కాంగ్రెస్ కు 14 దక్కాయి. కృష్ణా జిల్లాలో టీడీపీకి 30, కాంగ్రెస్ కు 15 దక్కగా.. గుంటూరు జిల్లాలో టీడీపీకి 45, కాంగ్రెస్ కు 14 పంచాయతీలు వశమయ్యాయి. ఇక నెల్లూరులో కాంగ్రెస్ పైచేయి సాధించింది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ కు 47 పంచాయతీలు పరంకాగా.. టీడీపీ, వైకాపాలు చెరో 38 పంచాయతీలతో సమవుజ్జీలుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News