: ఎన్నికల ఫలితాల్లో వెనకబడిన 'కారు'
పంచాయతీ ఎన్నికల్లో 'కారు' జోరు కాసింత తగ్గినట్టు కనిపిస్తోంది. సర్పంచి ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల జోరుకు వెనుకంజలో నిలుస్తోంది. ముఖ్యంగా.. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ మద్దతు దారులు 21 స్థానాలు గెలుచుకోగా, టీడీపీ 19, టీఆర్ఎస్ 8, ఇతరులు 28 చోట్ల విజయం సాధించారు. ఇక, మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ 29, టీడీపీ 29, వైకాపా 15 పంచాయతీలను చేజిక్కించుకోగా టీఆర్ఎస్ 1 స్థానం దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ 6, టీడీపీ 5, వైకాపా 1, టీఆర్ఎస్ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కు 26 పంచాయతీలు దక్కితే, టీఆర్ఎస్ తొమ్మిదింట మాత్రమే నెగ్గింది. ఇంకా, ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నందున పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడికాలేదు.