: అమర్త్యసేన్ కు శరద్ యాదవ్ మద్దతు
మోడీ ప్రధాని కావాలని ఓ భారతీయ పౌరుడిగా తాను కోరుకోవడం లేదని, మైనారిటీలు తమకిక్కడ రక్షణ ఉందని భావించే ఒక్క చర్యనూ ఆయన చేపట్టలేదంటూ అమర్త్యసేన్ చేసిన వ్యాఖ్యలకు శరద్ యాదవ్ మద్దతు పలికారు. ప్రముఖ ఆర్ధికవేత్త అమర్త్యసేన్ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని, మోడీకి అంత ప్రాధాన్యత ఇవ్వకుంటే తాము బీజేపీతో సంబంధాలను తెంచుకునేవాళ్లము కాదని శరద్ యాదవ్ తెలిపారు.