: రాయల్ బేబీ జననం లో భారతీయ వైద్యుడి హస్తం


బ్రిటన్ రాజవంశానికి కొత్త వారసుడొచ్చిన సంగతి తెలిసిందే. భావి యువరాజు జననంలో భారతీయ వైద్యుడి హస్తం ఉంది. నియోనాటాలజిస్ట్ సునీత్ వినోద్ గొడాంబే ముంబైలో పుట్టి పెరిగారు. అతను ప్రస్తుతం లండన్ లోని సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో తన సేవలందిస్తున్నారు. రెండో ఎలిజబెత్ మహారాణికి గైనాకాలజిస్టుగా సేవలందించిన మార్కస్ సెట్చెల్(69) బృందం యువరాణి కేట్ మిడిల్టన్ ప్రసవానికి సేవలందించింది. పది గంటలపాటు పురిటినొప్పులను అనుభవించిన కేట్ మిడిల్టన్ ఎట్టకేలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పురుడు పోసిన బృందంలో సెట్చెల్, గొడాంబేతో పాటు గయ్ ధోర్ప్ బీస్టన్ కూడా ఉన్నారు. ఈయన ప్రసవసమయంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడంలో నిపుణులు.

  • Loading...

More Telugu News