: లేడీ గాగా.. 27 ఏళ్ళకే వెరీ రిచ్


లేడీ గాగా (27).. తన గాత్ర మాధుర్యం కన్నా విలక్షణ ఆహార్యంతోనే ఆకట్టుకుంటుందీ పాప్ సంచలనం. యూత్ లో యమక్రేజ్ స్వంతం చేసుకున్న ఈ స్టార్ సెలబ్రిటి ఇప్పుడు ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో నెంబర్ వన్ ప్లేసులో నిలిచింది. 30 ఏళ్ళలోపు ధనిక సెలబ్రిటీల జాబితా ప్రకటించిన ఫోర్బ్స్ ఈ అమ్మడికి అగ్రతాంబూలం ఇచ్చింది. 2012-13 మధ్య కాలంలో లేడీ గాగా సంపాదన చూస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే. పాటలు, కచేరీల రూపంలో అక్షరాలా రూ. 478 కోట్లు గాగా ఖాతాలో వచ్చిపడ్డాయి. ఇక కుర్ర పాటగాడు జస్టిన్ బీబర్, తాజా పాప్ క్వీన్ టేలర్ స్విఫ్ట్ .. గాగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. త్వరలో ఆర్ట్ పాప్ పేరిట నూతన గీతగుచ్ఛం విడుదల చేయనున్న గాగా.. ఆ ఆల్బం మార్కెట్లోకి వస్తే తన సంపాదన మరింత పెంచుకోవడం ఖాయమని పాప్ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News