: నకిలీ బంగారం కేసులో వైఎస్సార్సీపీ నేత అరెస్టు
వైఎస్సార్సీపీకి మోసగాళ్లు, నేరగాళ్ల మకిలి వదలట్లేదు. మొన్నామధ్య రాజమండ్రిలో ఆ పార్టీకి చెందిన నేత ఏటీఎం వాచ్ మన్ ను హత్య చేసి కోట్లు కాజేసేందుకు ప్రణాళిక రచించి అడ్డంగా దొరికిపోతే, తాజాగా, నకిలీ బంగారం పేరుతో మోసగించిన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జి సిద్దార్ధరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో అరెస్టు కావడంతో వెంటనే సిద్ధార్థరెడ్డిని బహిష్కరిస్తున్నట్టు వైఎస్సార్సీపీ ఓ ప్రకటనలో తెలిపింది.