: పేదరికం తగ్గిందట..!
దేశంలో పేదరికం తగ్గిందని ప్రణాళికా సంఘం ప్రకటించింది. 2011-12 సంవత్సరానికి పేదరికం 21.9 శాతానికి తగ్గినట్టు ప్రణాళికా సంఘం పేర్కొంది. 2004-05 లో పేదరికం 37.2 శాతం ఉండేదని పేర్కొంది. పెరుగుతున్న ధరలతో జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయని.. పల్లెలు, పట్టణాల్లో పేదరికం పెరుగుతోందని.. జీవన వ్యయం పెరగడం వల్ల పౌష్ఠికాహారం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తూ ఈ మధ్యే ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది. కానీ, తాజాగా ప్రణాళికా సంఘం మాత్రం పేదరికం తగ్గిందని అంటోంది.