: అగ్రశ్రేణి కమెడియన్లతో 'నవ్వుల సాయంత్రం'


టాలీవుడ్ టాప్ కమెడియన్లతో 'సంగమం' ఫౌండేషన్ ఓ కామెడీ షో నిర్వహించనుంది. ఈనెల 27న సాయంత్రం 6.30 గంటలకు ఈ హాస్య వల్లరి ఉంటుంది. ఈ కార్యక్రమానికి, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం వేదికగా నిలవనుంది. 'నవ్వుల సాయంత్రం' పేరిట ప్రదర్శితమయ్యే ఈ షోలో.. తెలుగు చిత్రసీమ నెంబర్ వన్ కామెడీ నటుడు బ్రహ్మానందం తన టైమింగ్ తో కితకితలు పెట్టనున్నాడు. మూడు గంటలపాటు సాగే ఈ కామెడీ కార్యక్రమంలో తనికెళ్ళ భరణి, అలీ, కొండవలస, జయప్రకాశ్ రెడ్డి, గుండు హనుమంతరావు, ఉత్తేజ్, శివారెడ్డి, నల్లవేణు ప్రేక్షకులను నవ్వించనున్నారు.

డోనర్ పాసులున్నవారినే ఈ షోకి అనుమతిస్తారు. పాసులను ఆన్ లైన్లో 'బుక్ మై షో.కామ్' ద్వారా పొందవచ్చు. ఇతర వివరాలకు 9490484606, 9989741505 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. 'సంగమం' ఫౌండేషన్ కు నిధుల సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News