: మోడీ కమిటీలపై శతృఘ్నసిన్హా విసుర్లు


నరేంద్ర మోడీ నాయకత్వంలో పలు కమిటీల ఏర్పాటుపై బీహార్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు శతృఘ్నసిన్హా విమర్శలు గుప్పించారు. సీనియర్లను విస్మరించడంపై మండి పడ్డారు. మోడీ నియామక కమిటీలను 'లాలీపాప్' లుగా అభివర్ణించారు. ఏ కమిటీలోనూ తనకు ప్రాధాన్యత కల్పించకపోవడంపై కినుక వహించిన శతృఘ్నసిన్హా తమ పార్టీలో అద్వానీని మించినవారు లేరని అన్నారు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై పార్లమెంటరీ బోర్డుదే తుది నిర్ణయమన్నారు. సీనియర్లను విస్మరించడం సరికాదంటూ, రాం జెఠ్మలానీపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News