: ఐబీఎల్ పై గుత్తా జ్వాల మండిపాటు


హైదరాబాద్ షట్లర్ గుత్తా జ్వాల 'ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్' పై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఐబీఎల్ వేలంలో తన ప్రారంభ ధర (రూ. 29 లక్షలు) తగ్గించడంపై మండిపడింది. నిన్న జరిగిన వేలంలో జ్వాల, మరో క్రీడాకారిణి అశ్వనీ పొన్నప్పలను ఢిల్లీ స్మాషర్స్, పుణే పిస్టన్స్ ఫ్రాంఛైజీలు కైవసం చేసుకున్నాయి. ఇందులో జ్వాల ధర రూ.18 లక్షలు కాగా అశ్వని పొన్నప్పకు రూ. 14 లక్షల ధర లభించింది. దీనిపై తాను, అశ్వని తీవ్ర నిరాశ చెందామన్న జ్వాల ఐబీఎల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఐకాన్ క్రీడాకారులుగా ఈ కాంట్రాక్ట్ ఒప్పుకున్నామని.. కానీ, తమ ప్రారంభ ధరను తగ్గించడంపై సమాచారం కూడా లేదని చెప్పింది. అంతేకాక, ఐబీఎల్ మహిళల డబుల్స్ స్థానంలో సింగిల్స్ పెట్టిన విషయం కూడా తనకు ఆలస్యంగా తెలిసిందని, ఇందుకు తాను బాగా నిరాశపడ్డానని చెప్పింది. దీనిపై స్పందించిన స్పోర్టీ సొల్యూషన్స్ సీఈవో ఆశిష్ చద్దా.. జ్వాల, అశ్వని నష్టపోయిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఐబీఎల్ నిర్ణయించిందన్నారు. వేలంలో అమ్ముడుపోని వారిద్దరిని చివరికి ప్రారంభధర తగ్గించి తీసుకున్నామని వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News