: 40 ఏళ్ల నాటి సినిమా.. ఇన్నాళ్ళకు రిలీజ్


ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నిర్మించిన సినిమా ఇన్నాళ్ళకు విడుదలకు నోచుకుంటోంది. అలనాటి ప్రముఖ నటుడు, దర్శకుడు జాయ్ ముఖర్జీ ఈ 'లవ్ ఇన్ బాంబే' సినిమాను నిర్మించారు. 'లవ్ ఇన్ బాంబే' సినిమాలో ప్రముఖ నటులు అశోక్ కుమార్, కిషోర్ కుమార్, వహీదా రెహమాన్ నటించారు. అయితే, ఈ సినిమాను 1973 లోనే నిర్మించినా పలు కారణాలతో అప్పట్లో విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా నెగిటివ్ లు, జాయ్ సంతానం సుజోయ్ ముఖర్జీ, మన్ జాయ్ ముఖర్జీ, సిమ్రాన్ హల్వాసియాలకు వర్లిలోని ఫజల్ భాయ్ కోల్డ్ స్టోరేజిలో లభ్యమయ్యాయి. వాటిని వీరు డిజిటల్ రూపంలోకి మార్చి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News