: విద్యార్ధులను చంపేందుకు భోజనంలో విషం కలిపిన పంచాయతీ రాజ్ ఉద్యోగి


పాత కక్షలను మనసులో ఉంచుకుని ఓ పంచాయతీ రాజ్ ఉద్యోగి విద్యార్థులు తినే భోజనంలో విషం కలిపాడు. మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో విధుల నుంచి సస్పెండైన పంచాయతీ రాజ్ ఉద్యోగి భజన్ సింగ్ కు స్థానిక హాస్టల్ వాచ్ మన్ తో విభేదాలున్నాయి. దీంతో భజన్ సింగ్, అక్కడి విద్యార్థులు రాత్రి తినే భోజనంలో విషం కలిపి వెళ్లిపోయాడు. కాసేపటికి ఆ భోజనంలోంచి ఘాటైన వాసన వస్తుండడంతో వంటమనిషికి, సూపరిండెంట్ కి సమాచారం అందించారు విద్యార్థులు. హాస్టల్ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపారు. ఈ హాస్టల్ లో 34 మంది బాలలు ఉన్నారు. వారు అప్రమత్తమవ్వకుంటే పెను ప్రమాదం జరిగేది. భజన్ సింగ్ పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News