: దాణా కేసులో లాలూకు ఊరట
పశుదాణా కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఈ కేసు విచారణను రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులోనే మరో జడ్జికి బదిలీ చేయడానికి అనుమతించింది. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న పత్యేక సీబీఐ కోర్టు జడ్జి పీకే సింగ్.. తన రాజకీయ ప్రత్యర్థి, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కేబినెట్ లోని మంత్రి పీకే షాహి బంధువని, కనుక కేసు విచారణను మరో జడ్జికి బదిలీ చేయాలని లాలూ ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఎట్టకేలకు ఆయన అభ్యర్థనను సుప్రీం అంగీకరించింది. ఆగస్ట్ 6న పశుదాణా కేసును మరో జడ్జికి బదిలీ చేసి, విచారణ ముగింపునకు కాలవ్యవధి నిర్ణయిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.