: నక్సల్స్ సమస్య సీమాంధ్రలోనే ఉంది: వివేక్


నక్సల్స్ సమస్య వాస్తవానికి సీమాంధ్రలోనే ఉందని పెద్దపల్లి ఎంపీ వివేక్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే నక్సల్స్ సమస్య తీవ్రమవుతుందంటూ కాంగ్రెస్ హైకమాండుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. ఈ ఉదయం వివేక్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రక్రియపై సీడబ్ల్యూసీ పనులు వేగవంతమైన సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజుల కిందటే వివేక్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News