: ఇదీ ప్రజాస్వామ్యం...డబ్బులివ్వలేదని పోలింగ్ అడ్డుకున్న ఓటర్లు
స్థానిక ఎన్నికల సందర్భంగా పల్లెల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు తాయిలాల ఎరవేసి ఓటర్లను ఆకట్టుకోవడం మామూలే, కానీ ఇక్కడ ఓటర్లే స్వచ్ఛందంగా అమ్ముడుపోయి సంచలనం సృష్టించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చివులూరు గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు డబ్బులు ఇవ్వలేదంటూ, ఓటర్లు పోలింగ్ ను అడ్డుకున్నారు. ఉదయం 7:40 గంటల వరకూ ఏజెంట్లను కూడా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయలేదు. దీంతో స్థానిక నాయకులు వచ్చి ఓటర్లతో మాట్లాడడంతో వారు పోలింగ్ నిర్వహించేందుకు అనుమతించారు.