: 9 ఏళ్లలో 'మౌనమోహన్' 1300 ప్రసంగాలు
'మౌనమోహన్'.. పిడుగులు పడుతున్నా, దేశం సమస్యలతో సతమతమవుతున్నా ప్రధాని స్పందించకుండా మౌనంగా ఉంటారంటూ ప్రతిపక్షాలు ఆయనకు ఈ పేరు పెట్టేశాయి. కానీ, నిజం మరోలా ఉంది. ప్రధాని తన తొమ్మిదేళ్ల పదవీ కాలంలో ఇప్పటి వరకూ 1300 ప్రసంగాలను దంచికొట్టారు. అంటే, కనీసం మూడు రోజులకోసారైనా ఉపన్యాసం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని కార్యాలయం ఈ వివరాలను ట్విట్టర్లో పెట్టింది. వీటిలో ప్రధాని మీడియా సమావేశాలలో మాట్లాడిన దానికంటే సమావేశాల ప్రారంభం, ముగింపు సందర్భంగా మాట్లాడినవే ఎక్కువ.