: బ్రిటన్ రాకుమారుడి పుట్టుకతో కొందరికి సిరుల పంట


బ్రిటన్ యువరాజ్ విలియమ్స్, కేట్ మిడిల్ టన్ దంపతులకు పుట్టబోయే బిడ్డ ఆడా? మగా? దీనిపై సోమవారం వరకూ బ్రిటన్ వ్యాప్తంగా వేలాదిమంది పందేలు మీద పందేలు వేసుకున్నారు. ఎవరికి తోచినంత వారు. మగ శిశువే అని పందేలు కాసిన వారు ఇప్పటికే కోటీశ్వరులయ్యారు. సోమవారం ఒక్కరోజే 50,000 మంది ఆడ శిశువు అయితే ఏ పేరు? మగ శిశువు అయితే ఏ పేరు? అని బెట్టింగ్ వేసుకున్నారు. అమ్మాయి అయితే అలెగ్జాండ్రా, అబ్బాయి అయితే జేమ్స్ లేదా జార్జ్ ఇవీ వారి ఊహాత్మక పేర్లు. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి.

క్రీడలను మినహాయిస్తే, అతిపెద్ద బెట్టింగ్ ఇదేనని బెట్టింగ్ ఏజెన్సీ 'కోరల్' అభివర్ణించింది. బెట్టింగ్ లో ఒక అంకం పూర్తయింది. మగ శిశువు అని తేలిపోయింది. ఇప్పుడు ఏ పేరు అనే మరో అంకం మిగిలి ఉంది. ఇదెంత మందిని కోటీశ్వరులను చేస్తుందో, ఎంత మంది చేతులను కాలుస్తుందో చూడాలి. బ్రిటన్ వాసుల్లో ఆసక్తి కారణంగా బెట్టింగ్ ఏజెన్సీల పంట కూడా పండుతోంది.

  • Loading...

More Telugu News