: ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మేనల్లుడు అరెస్ట్


సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మేనల్లుడు పిల్లి దుర్గాప్రసాద్ యాదవ్ ను బంజరాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసారు. ఆయనతో పాటు అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు శ్రీమత్ యాదవ్ ను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదివారం ఉదయం పార్క్ హయత్ హోటల్ నుంచి మంత్రి రఘువీరారెడ్డి ఇంటికి వెళుతుండగా ఆయన కాన్వాయ్ లోని కారులో అంజన్ కుమార్ యాదవ్ ఎక్కారు. దీంతో సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆయనను కారు నుంచి దించేయడంతో ఆగ్రహించిన ఎంపీ అనుచరులు కారుఫై రాళ్లు రువ్వి కారు అద్దాలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం దాడికి పాల్పడిన నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా మిగతా ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News