: చనిపోయిన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు


ద్విచక్రవాహనం మీద ప్రయాణిస్తూ రోడ్డు మీద గుంతలను తప్పించబోయి ప్రమాదానికి గురై మరణించిన ఓ మహిళపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె తలకు హెల్మెట్ పెట్టుకోలేదని అందుకే ఆమె మరణించిందని ఆరోపిస్తున్నారు. కాగా, పది రోజుల క్రితం ఉమేశ్(28) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హెల్మెట్ పెట్టుకున్నా, ఇక్కడే ప్రమాదానికి గురై మరణించాడు. ముంబైలోని వాసాయ్ ప్రాంతంలో రోడ్డు మీద పెద్దపెద్ద గుంతలు వాహనదారులకు అడ్డంపడుతున్నాయి. తప్పించాలని చూస్తూనే చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు.

తాజాగా 48 ఏళ్ల మహిళ తన కుమార్తెతో కలిసి ప్రయాణిస్తూ గుంతలు తప్పించబోయి ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆర్ధిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఏటా వందల కోట్లు ఖర్చుపెడుతున్నా రోడ్ల పరిస్థితుల్లో మార్పు ఉండడం లేదని, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News