: జమ్మూకాశ్మీర్ లో భూకంపం 22-07-2013 Mon 18:30 | జమ్మూకాశ్మీర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1 గా నమోదైంది. బదెర్వా కనుమ, దోడా, కిష్త్వార్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని సమాచారం. కాగా నష్టంపై అధికారిక సమాచారం వెలువడలేదు.