: తొలిదశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా 5,803 పంచాయతీలకు రేపు ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. తర్వాత రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మొదట వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు, తర్వాత సర్పంచి అభ్యర్ధుల ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు.
కాగా, వర్షాలు, వరదల వల్ల 237 పంచాయతీల్లో పోలింగ్ వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. వేలం నిర్వహించిన 18 పంచాయతీల్లో ఎన్నికలు రద్దు చేశామని, త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.