: ఫేస్ బుక్ ఛాట్ తో సంసారాన్ని ఛిద్రం చేసుకున్న ప్రభుత్వోద్యోగి


పెళ్లాం పిల్లలున్న ఓ వ్యక్తి హాయిగా సంసారం చేసుకోక.. కక్కుర్తి పడ్డాడు, ఫలితం అనుభవిస్తున్నాడు. వివరాల్లోకెళితే, హైదరాబాద్ లో అశోక్ కుమార్ అనే ప్రభుత్వోద్యోగికి, అతని మిత్రుడు మురళీధర్ అనే వెటర్నరీ డాక్టర్ కి మధ్య విభేధాలు తలెత్తాయి. అశోక్ ను ఎలాగైనా అప్రదిష్ట పాల్జేయాలనుకున్నాడు మురళీధర్. అనుకున్నదే తడవుగా మిత్రుడి బలహీనతలు తెలిసిన మురళీధర్.. అమ్మాయి పేరు మీద ఓ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి దాని మీద శృంగారభరితమైన మాటలతో ఛాట్ ప్రారంభించాడు. దీంతో తనతో ఛాటింగ్ చేస్తోంది అమ్మాయేనని భ్రమ పడ్డ అశోక్ మరింత స్పీడందుకున్నాడు.

కొన్ని రోజుల తరువాత అశోక్ ఛాట్ వివరాలు అతని భార్యకు అందించాడు మురళీధర్. అంతే... పచ్చని సంసారం నిప్పుల కొలిమిలా తయారయ్యింది. కాపురం కలతలమయమైంది. సీన్ కట్ చేస్తే.. విడాకులకు దారితీసింది. విషయం తెలుసుకున్న అశోక్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కూపీలాగిన పోలీసులు చివరకు మురళీధర్ ను అరెస్టు చేశారు. అనంతరం మురళీధర్ బెయిలుపై విడుదలయ్యాడు.

  • Loading...

More Telugu News