: బాలికపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో బీఎస్పీ నేత


సామాజిక నెట్ వర్కింగ్ సైట్లు అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా వెలుగుచూస్తున్న ఉదంతాలు ఫేస్ బుక్ సంబంధాల పట్ల జాగరూకతతో ఉండాలని హెచ్చరిస్తున్నాయి. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. వివరాల్లోకెళితే ప్లస్ టూ చదువుతున్న బాలిక ఫేస్ బుక్ స్నేహితుడితో డేటింగ్ కి వెళ్లింది. కానీ.. అతను, అతని మిత్రులు నడుస్తున్న కారులో ఆమెపై అత్యాచారం చేసి రోడ్డుమీద పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు మళ్లీ ఆమె ఇంటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆమె సోదరుడిని చంపేస్తామని బెదిరించారు. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, బాలికపై అత్యాచారానికి పాల్పడినవారిలో బీఎస్పీ నేత కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News