: అమెరికాలోనూ హిందీనే మాట్లాడుతారా..?: రాజ్ నాథ్ కు కాంగ్రెస్ కౌంటర్


'తమరు అమెరికాలోనూ హిందీ భాషే మాట్లాడతారా?'.. అంటూ బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. గత వారం రాజ్ నాథ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇంగ్లిష్ భాష భారతీయ సంస్కృతిని నాశనం చేసిందని అన్నారు. కాగా, రాజ్ నాథ్ సింగ్ అమెరికా పర్యటనలో భాగంగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలపైనా, ఇంకా పలు సభల్లోనూ ఉపన్యసించాల్సి ఉంది. ఈ కార్యక్రమాల్లో ఆయన ఏ భాషలో మాట్లాడతారో చూడాలని, ఇలాంటి సిద్ధాంతాలతో ఆయన అమెరికా పర్యటనలో ఏం సాధిస్తారో కాలమే చెబుతుందని కేంద్ర మంత్రి మనీష్ తివారీ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News