: పన్నెండువేల పారా మెడికల్ పోస్టులకు సీఎం పచ్చజెండా
రాష్ట్రంలో 12 వేల పారామెడికల్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పచ్చజెండా ఊపారు. వచ్చే మూడేళ్ళలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. అంతేగాకుండా, మరో మూడు నెలల్లో 1900 మంది వైద్యులను నియమిస్తామని తెలిపారు. సచివాలయంలో నేడు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమైన సీఎం ఈమేరకు నిర్ణయాలు వెలిబుచ్చారు.