: రాగల 48 గంటల్లో రాష్ట్రంలో భారీవర్షాలు
రాగల 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పారు. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.