: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ఆగని హింస.. 8 మంది మృతి
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో మరోసారి హింస చెలరేగింది. ఇక్కడి ముర్షీదాబాద్, బిర్హుమ్, మల్దా, నదియా జిల్లాల్లో నాలుగవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. సీపీఐ(ఎమ్), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు జరిగిన ఘర్షణల్లో ఎనిమిది మంది మరణించారు. పన్నెండు మందికి గాయాలయ్యాయి. ముర్షీదాబాదులో ఓ ఘటనలో సీఆర్ పీఎఫ్ జవాన్లు కాల్పులు జరపగా, ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి చనిపోయాడు. కొంతమంది ఓటర్లు భయంతో పరుగులు తీశారు. కాగా, నలుగురు సీఆర్ పీఎఫ్ జవాన్లకు కూడా గాయాలయ్యాయి.