: నెక్లెస్ రోడ్డులో 'కేన్సర్' వాక్


రొమ్ము కేన్సర్ పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఈ రోజు ఉదయం ప్రత్యేకంగా నడక కార్యక్రమం జరిగింది. రొమ్ము కేన్సర్ నెల సందర్భంగా కిమ్స్ ఆస్పత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణ బాబు జెండా ఊపి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రొమ్ము కేన్సర్ గురించి అందరూ తెలుసుకోవాలనీ, అప్పుడే కేన్సర్ రహిత సమాజం సాధ్యమనీ కృష్ణబాబు అన్నారు. రెండు కిలోమీటర్ల నడకలో యువత అధిక సంఖ్యలో పాల్గొంది. 

  • Loading...

More Telugu News