: కెన్యా గులాబీ తోటల సౌర విప్లవం


ఆఫ్రికన్ దేశాల్లో సౌకర్యాల కల్పన కష్టం తో కూడుకున్నపని. అందుకే, ఆక్కడ కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేని దేశాలు చాలా ఉన్నాయి. అందులో కెన్యా ఒకటి. అలాంటి కెన్యా గులాబీ తోటలకు ప్రసిద్ధి. కెన్యాలో గులాబీల సాగంటే మాటలా... కానీ, ఈ దేశానికి గతేడాది 4,550 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే సాగు ఎలా ఉందో ఊహించండి. అయితే ఇక్కడ విద్యుత్ తీవ్ర సంక్షోభంలో ఉంది. కాగా విద్యుత్తు సరఫరా అయినా లో-ఓల్టేజి, హై-ఓల్టేజీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడి పూదోటల యజమానులు. వీటికి పరిష్కారంగా సోలార్ విద్యుత్కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటికి ఆద్యులుగా రెడ్ ల్యాండ్ రోజెస్ ప్రాజెక్టు నిలుస్తోంది.

విద్యుత్ సమస్యను ఎదుర్కొనేందుకు ఎండలు మండే కెన్యాలో 30 కిలో వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుందీ సంస్థ. దీంతో డీజిల్ ఖర్చులు, విద్యుత్ ఖర్చులు తగ్గిపోయాయి. దీంతో పెరిగిన విమాన ఛార్జీలకు ఈ నిధులను కేటాయించగలడంతో పాటు, లాభాలు కూడా ఆర్జిస్తున్నామని సదరు సంస్ధ తెలిపింది. వీరి విధానాన్ని అధ్యయనం చేసిన కెన్యా ఫ్లవర్ కౌన్సిల్ సైతం ఇతర పూల సాగుదారులకు సౌరవిద్యుత్తు ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇస్తోంది.

  • Loading...

More Telugu News