: ఒకే మాటపై నిలబడండి: శ్రేణులకు రాహుల్ పిలుపు
తలో మాట మాట్లాడకుండా అందరూ ఒకేతాటిపై నిలబడాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ రెండు రోజుల మీడియా వర్క్ షాపు ఈ రోజు ఢిల్లీలో ప్రారంభమైంది. రాహుల్ ప్రారంభోపన్యాసం చేశారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్నందున పార్టీ ప్రచారం, సమాచార వ్యాప్తి తదితర విషయాలపై శిక్షణ కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఎవరికి వారు వ్యక్తిగత పరపతి కోసం కాకుండా పార్టీ గురించి ప్రచారం చేయాలని, సానుకూల రాజకీయాలే నిర్వహించాలని రాహుల్ హితవు పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. మనందరం కలిసి నూతన భారత్ ను నిర్మించాలన్నారు. ఈ శిక్షణా శిబిరం ద్వారా సీనియర్ల అనుభవాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.