: మోపిదేవి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్ పై విచారణను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మోపిదేవి కొంతకాలం నుంచి చంచల్ గూడ జైలులో రిమాండు ఖైదీగా ఉంటున్నారు. కాగా, కొన్నిరోజుల కిందట అనారోగ్యం పాలయిన మోపిదేవి చికిత్స పొందిన సంగతి తెలిసిందే.