: కాంగ్రెస్ మాజీ ఎంపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసు
కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసు జారీ చేసింది. 1984 సిక్కుల ఊచకోత కేసులో సజ్జన్ కు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ రోజు ఆయనకు నోటీసు పంపింది. దీనిపై తన స్పందనను తెలియజేయాలని జస్టిస్ జీఎస్ సిస్తాని, జీపీ మిట్టల్ ఆధ్వర్యంలోని బెంచ్ సజ్జన్ ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది.