: అందరూ చూస్తుండగా ఇరాన్ రాయబారి కిడ్నాప్


పట్టపగలు అందరూ చూస్తుండగా ఇరాన్ దౌత్యవేత్త కిడ్నాపయ్యారు. యెమెన్ రాజధాని సనా నగరం నడిబొడ్డున కొందరు ఆల్ ఖైదాకు చెందిన దుండగులు ఇరానీ దౌత్యవేత్తను అపహరించుకుపోయారు. ఇరాన్ రాయబార కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్ విషయాన్ని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ దృవీకరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అలీ అక్బర్ సలేహీ యెమెన్ మంత్రి అబూ బకర్ అల్ కుర్బీకి ఫోన్ చేసి తమ దౌత్యవేత్తను విడిపించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అరబ్ దేశాల్లో దౌత్యవేత్త కిడ్నాప్ కు గురికావడం ఇదే తొలిసారి. యెమెన్ లో సున్నీ ముస్లింలు అత్యధికంగా ఉండగా, ఇరాన్ షియా దేశం. ఉత్తర యెమెన్ లోని షియా ఖైదీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సాయమందిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే దౌత్యవేత్త కిడ్నాప్ కు గురయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News