: మోడీపై వీసా నిషేధం తొలగించండి: అమెరికాకు రాజ్ నాథ్ విజ్ఞప్తి


గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి అమెరికా గతకొంత కాలంగా వీసా నిరాకరిస్తుండడం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ గళమెత్తారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఆయన న్యూజెర్సీలో జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ, మోడీపై వీసా నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. భారత్ లో అత్యంత ప్రజాకర్షణ ఉన్న నాయకుడు మోడీ ఒక్కరే అని రాజ్ నాథ్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

అమెరికా తొలిసారిగా 2005లో మోడీ వీసా దరఖాస్తును తోసిపుచ్చింది. 2002లో జరిగిన గోధ్రా అల్లర్లను అదుపుచేయడానికి గుజరాత్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ వీసా నిరాకరించింది. అప్పటినుంచి మోడీకి అమెరికాలోని వివిధ వర్గాల నుంచి పలు ఆహ్వానాలు వచ్చినా, ఆయన వీసా కోసం దరఖాస్తు చేసుకోలేదు. అక్కడ జరిగే పలు సదస్సులలో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా భారత గడ్డపై నుంచే ప్రసంగిస్తున్నారు.

  • Loading...

More Telugu News