: అవనిగడ్డ ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్ధి ఖరారు
కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ తన అభ్యర్ధిని ఖరారు చేసింది. పార్టీ అభ్యర్థిగా దివంగత నేత అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరిబాబు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ ఉదయం బ్రాహ్మణయ్య కుటుంబ సభ్యులు హైదరాబాదులో చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఉప ఎన్నికపై చర్చించారు. వచ్చేనెల 21న అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.