: పొంచి ఉన్న ప్రాణాంతక ఎంఈఆర్ఎస్ వైరస్ ముప్పు


సార్స్ తరహా ప్రాణాంతక ఎంఈఆర్ఎస్ వైరస్ ముప్పు భారత్ కు ఎక్కువగా ఉందని టొరొంటోలోని సెయింట్ మైకేల్స్ హాస్పిటల్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. మధ్యప్రాచ్య దేశాల ద్వారా ఇది భారత్ కు వ్యాపిస్తుందని చెబుతున్నారు. త్వరలో సౌదీ అరేబియాలోని మక్కాలో లక్షలాది ముస్లింలు సామూహిక ప్రార్థనలకు హాజరు అవుతున్నందున, అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారి ద్వారా ఈ వైరస్ విస్తరిస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారత్ కు ఈ ముప్పు అధికమని వీరు చెబుతున్నారు. అందులోనూ ముంబై, కోజికోడ్ కు ఈ ప్రమాదం మరీ ఎక్కువట.

ఈ ఏడాది 1,70,000 మంది భారత్ నుంచి హజ్ యాత్రకు వెళుతున్నారు. ఎంఈఆర్ఎస్ వైరస్ ను 2012లో మధ్యప్రాచ్యంలోనే గుర్తించారు. తర్వాత పశ్చిమ యూరోప్, ఉత్తర అమెరికాలకూ వ్యాపించింది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 80 కేసులను గుర్తించగా.. సగం మంది ప్రాణం విడిచారు.

  • Loading...

More Telugu News