: షారూఖ్, సల్మాన్ అలింగనం
బాలీవుడ్ అగ్రహీరోలు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మళ్లీ కలిసిపోయారు. ఆదివారం రాత్రి ముంబైలో బాబా సిద్ధిఖీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దీంతో, ఐదేళ్లుగా అంటీముట్టనట్లుగా ఉన్న వీరి మధ్య అంతరాలు తొలగిపోయినట్లేనని భావిస్తున్నారు. 2008లో కత్రినాకైఫ్ పుట్టిన రోజు పార్టీ సందర్భంగా విబేధాలు రావడంతో అప్పటి నుంచి వీరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు.