: ఇక చంద్రుడి గురించి మరింత సమాచారం తెలుస్తుంది


చంద్రుడి గురించి ఇక బోలెడంత సమాచారాన్ని తెలుసుకునేందుకు మనకు వీలవుతుంది. దీనికి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రుడిపైన ఒక ప్రత్యేకమైన టెలిస్కోపును ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి వివరాలను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధృవంపైన వాతావరణం ఎలా వుంది? నీటి వనరులు ఉన్నాయా? వంటి పలు వివరాలను సేకరించేందుకు శాస్త్రవేత్తలు మానవ రహిత యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర ద్వారా చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు సాగించేందుకుగాను అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

అంతర్జాతీయ లూనార్‌ అబ్జర్వేటరీ సంఘం (ఐఎల్‌వోఏ), మూన్‌ ఎక్స్‌ప్రెస్‌లు అనే ప్రైవేటు సంస్థలు కలిసి తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవానికి మానవ రహిత యాత్ర చేపట్టనున్నాయి. 2016లో చేపట్టనున్న ఈ యాత్ర ద్వారా చంద్రుడిపై అంతర్జాతీయ లూనార్‌ అబ్జర్వేటరీ అనే శాశ్వత టెలిస్కోపును ఏర్పాటు చేయడానికి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ టెలిస్కోపు ద్వారా నిపుణులు, ఔత్సాహిక శాస్త్రవేత్తలు చంద్రుడి గురించి పరిశోధనలు సాగించేందుకు వీలవుతుంది. అలాగే ఈ అబ్జర్వేటరీ ద్వారా చంద్రుడి వద్ద ఖనిజాలు, నీటి వనరుల కోసం అన్వేషణ జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఇంధన వనరులు పుష్కలంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనల్లో తేలింది. ఐఎల్‌వోలో రెండు మీటర్ల డిష్‌ యాంటెన్నా ఉంటుంది. ఈ యాంటెన్నా ద్వారా చంద్రుడిపై పరిశోధనలు సాగించడానికి వీలవుతుంది. ఇలా చంద్రుడిపై భూమి ఉపరితలం నుండి పరిశోధనలు సాగించడానికి శాస్త్రవేత్తలు తొలిసారిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అనేక దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, దార్శనికులు పాలుపంచుకుంటారని ఐఎల్‌వోఏ వ్యవస్థాపకుడు స్టీవ్‌ డర్ట్స్‌ చెబుతున్నారు. ఈ అన్వేషణ ద్వారా ఇప్పటి వరకూ సరైన పరిశోధనలు సాగించని చందమామ దక్షిణ ధృవం వైపు దృష్టి సారించేందుకు వీలవుతుందని మూన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్థ సీఈవో రాబర్ట్‌ రిచర్డ్స్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News