: ఇక మూగవారి సైగలు వినిపిస్తాయి!
అదేంటి, మూగవారి సైగలు కనిపిస్తాయిగానీ వినిపిస్తాయా... అనేది మీ సందేహం. అయితే వారి సైగలను వినిపించేలా ఒక కొత్తరకం సాఫ్ట్‌వేర్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ మూగవారి సైగలను మాటల రూపంలో మనకు వినిపించేలా చేస్తుంది.
మైక్రోసాఫ్ట్ ఆసియా, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన కంప్యూటింగ్ టెక్నాలజీ సంస్థల పరిశోధకులు ఒక కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ పరికరానికి మైక్రోసాఫ్ట్ కినెక్ట్ డివైస్ అని పేరు పెట్టారు. ఈ డివైస్ బధిరుల సైగలను మాటలుగా వినిపించేలా చేస్తుంది. లేదా పాఠ్యంగా కనిపించేలా చేస్తుంది. బధిరులు తమ మనోభావాలను ఇతరులకు వ్యక్తం చేయడం చాలా కష్టం. వారు వ్యక్తం చేసినా, ఎదుటివారు వాటిని అర్థం చేసుకోవడం కూడా కష్టం. ఇలాంటి వారికి అనువుగా ఉండేలా శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఈ డివైస్ ప్రస్తుతం ప్రయోగదశలో ఉంది.