: చీకటిని ఇష్టపడేవారిని నమ్మకూడదట!


జీవితంలో వెలుగు, చీకటి అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా వస్తుంటాయి. అలాగే మనుషుల్లో కొద్దిమంది ఎక్కువగా వెలుగులో ఉండడానికి ఇష్టపడుతుంటారు, మరికొందరు చీకటిలో ఉండడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇలా వెలుగు, చీకటిని ఇష్టపడడంలోనే మనుషుల్లోని మంచి, చెడు భావాలు వ్యక్తమవుతాయంటున్నారు శాస్త్రవేత్తలు, వెలుగులో ఉండేవారు మంచితనంతో జీవనాన్ని సాగిస్తుండగా, చీకటిని ఎక్కువగా ఇష్టపడేవారు చెడు భావాలతో జీవనాన్ని సాగిస్తుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తైవాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఇలా చీకటి, వెలుగులు మనుషుల్లో ఎలాంటి మార్పులను తెస్తాయి? అనే విషయం దిశగా పరిశోధన సాగించారు. ఇందుకోసం వీరు మూడు వేర్వేరు గదులు ఏర్పాటు చేశారు. ఈ గదుల్లో ఒక గదిలో ఎక్కువ వెలుగు, మరొక గదిలో మామూలుగా ఉండే వెలుగు, మూడవ గదిలో అతి తక్కువ వెలుగు ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ మూడు గదుల్లోను స్త్రీ, పురుషులను ఉంచి వారికి వేర్వేరుగా కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు ఎదుటివారితోనూ, పక్కగదిలో ఉండేవారితోనూ పంచుకోవాలని సూచించారు. మిగిలిన వారికంటే ఎక్కువ వెలుతురు ఉన్న గదిలో ఉండేవారు తమ వద్ద ఉన్న సొమ్ములో అధికభాగం పంచుకున్నారని ఈ పరిశోధనలో తేలింది. తక్కువ వెలుగులో ఉండేవారిలో నిజాయతీ శాతం 51.9 శాతంగా ఉండగా, మామూలు వెలుగులో గడిపిన వారిలో ఇది 70.4 శాతంగాను, ఎక్కువ వెలుగులో ఉన్నవారిలో 85.2 శాతం ఉందని శాస్త్రవేత్తలు లెక్క కట్టారు. ఈ పరిశోధన ద్వారా అధికమైన వెలుగు మనుషుల్లో మంచిని పెంచుతుందని, వెలుగు తక్కువగా ఉంటే మనుషుల్లో మంచితనం కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News