: దీని కారణంగానే దైన్యస్థితి!
మన మనసులోని వివిధ భావాలకు పలు కారణాలు ఉంటాయి. అయితే మనుషుల్లో సాధారణంగా కనిపించే పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన, నిర్వేదం వంటి వాటికి కారణాలు ఏమిటి? అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. చివరికి మనిషిలో ఇలాంటి భావాల ఉనికి గుట్టు రట్టు చేశారు.
హెర్ట్‌ఫాంర్ట్‌షైర్ శాస్త్రవేత్తలు మనిషి మెదడులోనే పలు భావాలకు సంబంధించిన స్పందనలు ఉంటాయని, వీటిలో మెదడులోని పిట్యూటరీ గ్రంధిలో ఉండే ఒక అణువు మనిషిలోని మానసిక ఒత్తిడి, ఆందోళన, నిర్వేదం వంటి పలు భావాలకు కారణంగా గుర్తించారు. మెదడులోని పిట్యూటరీ గ్రంధిలో ఉండే 'సీఆర్‌ఏఫ్1' అనే అణువు (మాలిక్యూల్) ఇలాంటి భావాలకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైమండ్ లైట్ సోర్స్ అనే అతి సూక్ష్మ ఎక్స్‌రే పరికరం ద్వారా దాని పనితీరును శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. మానసిక ఒత్తిడి, తీవ్ర ఆందోళన, సదా నిర్వేదంగా ఉండడం వంటి వాటినే దైన్య స్థితిగా చెబుతారు. ఇలాంటి దైన్య స్థితికి కారణం పిట్యూటరీ గ్రంధిలోని ఆ చిన్న అణువుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.