: కేకేను నక్షత్రకుడితో పోల్చిన పాల్వాయి


టీఆర్ఎస్ లో చేరిన కేకేను కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నక్షత్రకుడితో పోల్చారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ అక్టోబరులోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2001లో చేసిన రెండో ఎస్సార్సీ నిర్ణయం ఉపసంహరించుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కేంద్రం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని స్పష్టం చేసిన ఆయన, కేసీఆర్ ను కలుపుకుని అధిష్ఠానం ముందుకెళ్తుందన్నారు. అయితే, అక్కడ చేరిన నక్షత్రకుడే కేసీఆర్ ను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News