: లంచగొండులంటూ రిటర్నింగ్ అధికారులపై ఎంపీడీవో ఫిర్యాదు
పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఎంపీడీవో జడ్పీసీఈవోకు ఫిర్యాదు చేసిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. ఈ జిల్లాలో బుక్కపట్నం రిటర్నింగ్ అధికారులు కృష్ణ, రమణలపై ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి వారిద్దరూ ఎన్నికల నామినేషన్లలో 84 వేల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ జడ్పీసీఈవోకు ఫిర్యాదు చేశారు.