: అశ్రునయనాలతో కోటగిరికి అంతిమ వీడ్కోలు
పశ్చిమగోదావరి జిల్లా తూర్పుయడవల్లిలో గుండెనొప్పితో అసువులుబాసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య అధికార లాంచనాలతో ముగిశాయి. కోటగిరి అంతిమ యాత్రలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుతో పాటు మంత్రి పితాని సత్యానారాయణ, డీసీసీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.