: బారులు తీరిన భక్తులు.. సొమ్మసిల్లిన మహిళ
సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. విశాఖపట్టణం సమీపంలోని సింహాచలంలోని సింహాచలేశుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరడంతో తోపులాట జరిగింది. దీంతో క్యూలైన్లో నిల్చున్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, సింహాచలం దేవస్థానంలో ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బంది తీరుతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తోపులాటలు జరిగి మహిళలు అనారోగ్యం పాలవుతున్నారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో, సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారు.