: అమెరికా ఉపాధ్యక్షుడి భారత పర్యటన రేపట్నుంచే
అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్ రేపట్నుంచి నాలుగు రోజులపాటు భారత్ లో పర్యటించనున్నారు. సతీ సమేతంగా రేపు న్యూఢిల్లీ చేరుకోనున్న బైడెన్ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భారత్ చేరుకున్న తరువాత జో బైడెన్ 22 న జాతిపిత మహాత్మా గాంధీ స్మృతి ప్రదర్శనశాలను సందర్శిస్తారు. 23 న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ లతో భేటీ కానున్నారు. ఈ భేటీలో వాణిజ్య, విద్యుత్తు, రక్షణ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించనున్నారు. 24, 25 తేదీల్లో ముంబై పర్యటనలో భాగంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ లో వ్యాపార రంగ ప్రముఖులతో సమావేశం అవుతారు. 25 వ తేదీ సాయంత్రం సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. 2008లో సెనేటర్ హోదాలో భారత్ ను సందర్శించిన జో బైడెన్ సోమవారం ఉపాధ్యక్షుడి హోదాలో తొలి సారి పర్యటించనున్నారు.