: దర్జాగా బియ్యం అమ్ముకుంటున్న ప్రధానోపాధ్యాయుడు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లలో మధ్యాహ్నభోజన పధకాన్ని చిత్తశుద్ధిగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ దేశంలో బలంగా వేళ్లూనుకున్న అవినీతి వల్ల అది సాధ్యం కావడం లేదు. తాజాగా పిల్లల మధ్యాహ్నభోజన పధకం బియ్యాన్ని అమ్ముకుంటూ పట్టుబడ్డాడో ప్రధానోపాధ్యాయుడు. త్రిపురలోని ఖాయర్ పూర్ లో 200 కిలోల బియ్యం రిక్షాతోపాటు ఉత్తమ్ కుమార్ భట్టాచార్య అనే ప్రధానోపాధ్యాయుడ్ని పోలీసులు పట్టుకున్నారు. ఇతనిపై అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు.