: ల్యాప్ టాప్ లతో విద్యారంగంలో మార్పు తెచ్చి చూపించాం: అఖిలేష్ యాదవ్


ఉత్తరప్రదేశ్ లో ల్యాప్ టాప్ ల పథకాన్ని ప్రవేశపెట్టి, విద్యారంగంలో మార్పు తెచ్చి ప్రజలకు చూపించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నాగోల్ లో జరిగిన యాదవ సమ్మేళనం బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, యాదవులు దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఉన్నారని, సామాజిక కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ అంటే వెనుకబడిన వర్గాల పార్టీగా ముద్ర ఉండేదని, తాము అధికారంలోకి వచ్చాక సంస్కరణలు చేపట్టి అభివృద్ధి సాధించామని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తమ రాష్ట్రంలో పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News