: న్యూజిలాండ్ ను కుదిపేసిన భూకంపం
న్యూజిలాండ్ ను భూకంపం కుదిపేసింది. రాజధానికి 15 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రత, రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది. ఈ భూకంపం సంభవించిన కొద్ది సేపటికే 5.5 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. రోజంతా లెక్కలేనన్ని సార్లు ప్రకంపనలు వస్తూనే ఉన్నాయని స్థానికులు తెలిపారు. అయితే నష్టం వివరాలు ఇంకా అధికారికంగా అందలేదు. కాగా, రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలిచే ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్ ఏడాదికి 15 వేల ప్రకంపనలు ఎదుర్కొంటుంది.