: చత్తీస్ గడ్ సీఎం కోటి లంచంపై కాంగ్రెస్ సీడీ విడుదల
చత్తీస్ గడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అవినీతి అధికారి నుంచి కోటి రూపాయలు లంచం పుచ్చుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 'ఇందుకు నిదర్శనం ఇదిగో' అంటూ ఒక సీడీ విడుదల చేసింది. కోపరేటివ్ బ్యాంక్ మేనేజర్ ఒకరు 24 కోట్ల రూపాయలు నొక్కేయగా.. అతడిని అవినీతి కేసు నుంచి విముక్తుడిని చేయడానికి సీఎం రమణ్ సింగ్ కోటి రూపాయలు తీసుకున్నారని, ఆయన కేబినెట్ మంత్రులు నలుగురు, మాజీ డీజీపీకి కూడా ముడుపులు ముట్టాయని, ఈ విషయాన్ని సంబంధిత అవినీతి అధికారే తెలిపారంటూ ఆరోపించింది. కానీ, ఈ సీడీ నకిలీదిగా ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పేర్కొన్నారు.